ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాకు క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యదర్శిగా పురుషుల, మహిళల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో జైషా చేసిన కృషిని సచిన్ ప్రశంసించారు. షా కృషి వల్లనే భారత బోర్డు ఇతర పాలక సంస్థల కంటే చాలా ముందుందని తెలిపారు. కాగా.. 2019 అక్టోబర్‌లో జైషా బీసీసీఐగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన ఇప్పుడు దాన్ని వదిలేయాల్సి వస్తోంది. డిసెంబర్ 1న ఐసీసీలో తన పదవిని చేపట్టనున్నాడు. 35 ఏళ్ల జయ్ షా ఐసీసీ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడు. అంతేకాకుండా.. ఐసీసీకి చైర్మన్ అయిన ఐదవ భారతీయుడు షా. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించాలని సచిన్ ఆకాంక్షించారు.
Mamata banerjee: ఎఫ్‌ఐఆర్ బుక్ అయితే ఇరుక్కుంటారు.. జూడాలకు మమత వార్నింగ్
ఎక్స్‌లో సచిన్ స్పందిస్తూ.. ‘ఉత్సాహంగా ఉండటం.. క్రికెట్ కోసం ఏదైనా మంచి చేయాలనే భావన క్రికెట్ నిర్వాహకుడికి అవసరమైన లక్షణాలు. జైషా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ లక్షణాలను బాగా ఉపయోగించారు. మహిళల క్రికెట్, పురుషుల క్రికెట్ రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వడంలో వారి ప్రయత్నాలు బీసీసీఐని ఇతర బోర్డులు కూడా అనుసరించగల నాయకుడిగా మార్చాయి. అతని తదుపరి ఇన్నింగ్స్‌కు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఐసీసీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా గుర్తింపు పొందాడు.’ అని పేర్కొన్నారు. ఇంతకు ముందు భారత్‌కు చెందిన పలువురు క్రీడా నిర్వాహకులు ఐసీసీకి నాయకత్వం వహించారని సచిన్ టెండూల్కర్ తెలిపారు. వారిలో జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్.. శశాంక్ మనోహర్ ఉన్నారు. అతను తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడని, క్రికెట్ ఆటను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తాడని అనుకుంటున్నట్లు సచిన్ పేర్కొన్నారు.
Being enthusiastic and having the drive to do something good for cricket are essential qualities for a cricket administrator. @JayShah displayed these traits wonderfully during his stint as @BCCI secretary.
His endeavours towards prioritising both women’s cricket and men’s…
— Sachin Tendulkar (@sachin_rt) August 28, 2024
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల అరటి పండ్లు ఉన్నాయో మీకు తెలుసా..?
మరోవైపు.. ఐసీసీ అధ్యక్షుడిగా కొత్త పాత్ర పోషించేందుకు ఎన్నికైన జైషాకు పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ జైషాకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా జైషాకు అభినందనలు తెలిపాడు. “ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైనందుకు @జయ్‌షాకు చాలా అభినందనలు. మీరు మున్ముందు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎక్స్ లో పేర్కొన్నారు.