పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల -60 కేజీల J1 విభాగంలో జూడోకా కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను ఇప్పన్ను కపిల్ పర్మా్ర్ ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పంజాబ్ & సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (punjabandsindbank.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కింద సంస్థలో 213 పోస్టులను భర్తీ చేశారు.
Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది.
కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం చేసి దోపిడీకి ప్రయత్నించిన కేసులో అంబులెన్స్ సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో అంబులెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
గోవాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పైశాచికానికి పాల్పడ్డారు. 9 ఏళ్ల విద్యార్థిని చితకబాదారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో.. చిన్నారిని దారుణంగా కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు సుజల్ గావ్డే, కనీషా గడేకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తన పుస్తకంలోని పేజీలను చింపివేయడంతో కోపాద్రిక్తులైన టీచర్లు.. విద్యార్థిని దారుణంగా చితకబాదారు.
దులీప్ ట్రోఫీ 2024 ఈరోజు అనంతపురంలో ప్రారంభమైన విషయం సంగతి తెలిసిందే.. ఇండియా B తరపున ఆడుతున్న అన్న సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి మ్యాచ్‌లో విఫలమయ్యారు. కానీ అతని తమ్ముడు ముషీర్ ఖాన్ శతకంతో మెరిశాడు. ముషీర్ ఖాన్ కూడా దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ముషీర్ ఖాన్ తొలి సెంచరీ సాధించాడు.
సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. శత్రు దేశానికి గరిష్ఠంగా నష్టం వాటిల్లేలా ఈ యుద్ధంలో ఇరుపక్షాలూ వివిధ రకాల ఆయుధాలు, రసాయనాలు వాడుతున్నాయి. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ ఈ మధ్య కాలంలో రష్యాపై అనేకమైన దాడులు చేసింది. అందులో కొత్త రకం దాడి కూడా కనిపించింది. ఉక్రెయిన్ డ్రోన్‌లను ఉపయోగించి రష్యన్ ప్రాంతాలలో కరిగిన థర్మైట్‌ను స్ప్రే చేసింది. ఉక్రేనియన్ డ్రోన్లు రష్యాలో మండే పదార్థాలను స్ప్రే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది.
మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్‌లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది.