Ukraine-Russia War: ‘కరిగిన థర్మైట్’ అంటే ఏమిటి..? రష్యాపై వేడి పుట్టిస్తోన్న కొత్త డ్రోన్లు
- రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం
- శత్రు దేశానికి నష్టం వాటిల్లేలా ఆయుధాలు.. రసాయనాలు వాడకం
- ఈ మధ్య కాలంలో రష్యాపై అనేక దాడులు చేసిన ఉక్రెయిన్
- డ్రోన్లను ఉపయోగించి రష్యన్ ప్రాంతాలలో కరిగిన థర్మైట్ స్ప్రే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. శత్రు దేశానికి నష్టం వాటిల్లేలా ఈ యుద్ధంలో ఇరుపక్షాలూ వివిధ రకాల ఆయుధాలు, రసాయనాలు వాడుతున్నాయి. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ ఈ మధ్య కాలంలో రష్యాపై అనేకమైన దాడులు చేసింది. అందులో కొత్త రకం దాడి కూడా కనిపించింది. ఉక్రెయిన్ డ్రోన్లను ఉపయోగించి రష్యన్ ప్రాంతాలలో కరిగిన థర్మైట్ను స్ప్రే చేసింది. ఉక్రేనియన్ డ్రోన్లు రష్యాలో మండే పదార్థాలను స్ప్రే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఉక్రెయిన్ మీడియాలో కూడా ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో OSINT టెక్నికల్ అనే వినియోగదారు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ డ్రోన్ చెట్లపై మండే పదార్థాలను పడవేయడం వల్ల అక్కడ మంటలు చెలరేగడం వీడియోలో చూడవచ్చు. ఈ మండే పదార్థం ‘కరిగిన థర్మైట్’ అని ఉక్రేనియన్ మీడియాలో తెలిపారు. అయితే.. ఈ వీడియో ఎప్పటిదో అనేది తెలియదు.
Read Also: Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్, చైనా మధ్యవర్తిత్వం.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
‘కరిగిన థర్మైట్’ అంటే ఏమిటి?
సైన్స్ ఛానల్ ప్రకారం.. థర్మైట్ అనేది అల్యూమినియం, ఫెర్రిక్ ఆక్సైడ్ (రస్ట్) యొక్క పొడి మిశ్రమం. ఇది ప్రతిస్పందించినప్పుడు అల్యూమినియం, కరిగిన ఇనుమును ఉత్పత్తి చేస్తుంది. ఈ పదార్ధం మండినప్పుడు 4,400 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. ఇది కరిగిన లావా కంటే రెండింతలు వేడిగా ఉంటుంది. ఇది ఏ ప్రాంతంలోనైనా అధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయడానికి.. అక్కడ ఉన్న ప్రతిదాన్ని బూడిద చేస్తుంది. దీనిని సాధారణంగా.. యుద్ధభూమిలో మొత్తం విధ్వంసం కోసం ఉపయోగిస్తారు. ఇది.. సైనిక వాహనాల రక్షణ కవచాన్ని కూడా కాల్చగలదని ఉక్రేనియన్ మిలిటరీ సెంటర్ తెలిపింది.
Read Also: Mumbai: నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ముగ్గురు కార్మికులు మృతి..
ఉక్రేనియన్ మిలిటరీ కరిగిన థర్మైట్తో కూడిన పేలోడ్లతో రెట్రోఫిట్ చేయబడిన డ్రోన్లను మోహరించడం ప్రారంభించిందని ఓ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ సైన్యం మానవరహిత వాహనాల (UAVలు – డ్రోన్లు) ఘోరమైన విమానాలను మరింత ప్రభావవంతంగా, శక్తివంతంగా చేయడానికి “ఫ్లేమ్త్రోవర్” ఆయుధాలుగా మారుస్తోంది. తద్వారా రష్యన్ భూభాగాలలో పెద్ద ఎత్తున అగ్ని యుద్ధం చేయవచ్చు. ఉక్రెయిన్ ఈ వ్యూహాన్ని రష్యాపై యుద్ధంలో ఒక ముఖ్యమైన వ్యూహాత్మక పురోగతిగా చూస్తుంది. ఉక్రెయిన్.. రష్యా సైనికులు దాక్కున్న చోట మృత్యువు వర్షం కురిపించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!