తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం దగ్గరకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత.. భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
దులీప్ ట్రోఫీలో ఇండియా 'D' పై ఇండియా 'C' ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా 'డి' జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా చోలాస్ గ్రామంలో ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. భారీ వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.
భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలం అయింది. సంగారెడ్డిలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో.. సెల్లార్లలో ఉంచిన బైకులు, కార్లు మునిగిపోయాయి. రెవెన్యూ కాలని, ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై తీవ్ర వరద ప్రభావం ఉంది.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు బద్దలు కొట్టింది. భారత్ ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు సాధించింది. ఈ గేమ్స్‌లో భారత్ తొలిసారిగా 6 బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.
శుక్రవారం స్కాట్‌లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. శతకం సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ రికార్డు సృష్టించాడు. ఈరోజు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులు ఇద్దరు అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్, స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొననున్నారు.
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో, ఏసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. బస్సు ఆగ్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నట్లు సమాచారం.