Converted To Hinduism: ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారిన ముస్లిం మహిళ.. ఎందుకంటే..?
- తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారిన ముస్లిం మహిళ
- భర్త వేధింపులు తట్టుకోలేక నిర్ణయం
- తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టిన మహిళ
- మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది. సనాతన సంప్రదాయంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను హిందూమతంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
Read Also: Shabbir Ali: ఇండోర్ స్టేడియం నిర్మాణానికి షబ్బీర్ అలీ శంకుస్థాపన
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
వివరాల్లోకి వెళ్తే.. ధమ్నార్ గ్రామంలో నివసిస్తున్న మెహనాజ్ (30), 12 మరియు 11 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం మందసౌర్‌లోని గాయత్రి ఆలయంలో హిందూ మతంలోకి మారింది. సుమారు గంటన్నరపాటు మంత్రాలు పఠించిన తర్వాత తమ కొడుకలకు నామకరణం చేశారు. అనంతరం.. మెహనాజ్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో మహిళలకు గౌరవం ఉందని యూట్యూబ్‌లో, ఇతర ప్రాంతాల్లో చూసేదానినని చెప్పింది. కుటుంబంలో వారికి గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే.. హిందూ సంస్థకు చెందిన వారిని సంప్రదించి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు మెహనాజ్ బీ(మీనాక్షి) చెప్పుకొచ్చింది. మెహనాజ్ బీకి 15 సంవత్సరాల క్రితం ధన్మార్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత భర్తతో పాటు అత్తమామల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని తెలిపింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయని.. ఏ చిన్న సమస్య వచ్చినా తిడుతూ కొట్టేవాడని పేర్కొంది. ఈ విషయం తన నాన్నకు చెప్పగా, ఇది మీ కుటుంబ విషయం అని అన్నాడని చెప్పింది.
Read Also: Ukraine-Russia War: ‘కరిగిన థర్మైట్’ అంటే ఏమిటి..? రష్యాపై వేడి పుట్టిస్తోన్న కొత్త డ్రోన్లు
హిందూ యువ వాహిని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ చైతన్య సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. రెండు మూడు నెలల క్రితం మెహనాజ్ హిందూ మతంలోకి రావడానికి సంప్రదించినట్లు చెప్పారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, మెహనాజ్.. ఆమె ఇద్దరు కుమారులు గాయత్రీ పరివార్ ఆలయానికి వచ్చారని తెలిపాడు. మీనాక్షి, ఆమె ఇద్దరు కుమారులు లవ్-కుష్ హిందూ మతంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 40 మంది మహిళలు, 5 మంది పురుషులు, ఇద్దరు పిల్లలను పూర్తిగా చట్టపరమైన విధానాలను అనుసరించి హిందూ మతంలోకి వచ్చారని రాజ్‌పుత్ చెప్పారు. హిందూ మతంలో చేరిన వారంతా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!