Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని
- ఇద్దరు టీచర్లు పైశాచికం
- 9 ఏళ్ల విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు
- చిన్నారిని దారుణంగా కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు అరెస్ట్
- పుస్తకంలోని పేజీలను చింపివేయడంతో కోపాద్రిక్తులైన టీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పైశాచికానికి పాల్పడ్డారు. 9 ఏళ్ల విద్యార్థిని చితకబాదారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో.. చిన్నారిని దారుణంగా కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు సుజల్ గావ్డే, కనీషా గడేకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తన పుస్తకంలోని పేజీలను చింపివేయడంతో కోపాద్రిక్తులైన టీచర్లు.. విద్యార్థిని దారుణంగా చితకబాదారు. దీంతో విద్యార్థి చేతులు, తొడలు, కాళ్లు, వీపుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. సాయంత్రం ఇంటికి వెళ్లిన తన కుమారుడిని చూసి తండ్రి చలించిపోయాడు. దీంతో.. చిన్నారి తండ్రి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఆగస్టు 2న జరిగింది.
Read Also: Duleep Trophy: అన్న విఫలం.. తమ్ముడు శతకం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఉపాధ్యాయులు చిన్నారిని స్కేల్‌తో కొట్టడమే కాకుండా చెప్పుతో కొట్టి, కడుపుతో తన్నారని, చెవులు పట్టుకుని బ్లాక్‌బోర్డ్‌పై ముఖాన్ని లాగారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిల్లలకు చదువు చెప్పాల్సిన పాఠశాలలోనే ఇంత దారుణం జరగడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఘటన తర్వాత టీచర్లిద్దరినీ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకున్న పోలీసులు.. ఉపాధ్యాయులపై గోవా చిల్డ్రన్స్ యాక్ట్ సెక్షన్ 8, జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 82, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు.
Read Also: Sikkim: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, నలుగురు సైనికులు మృతి
ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ, పోలీసు శాఖలు కఠిన చర్యలు తీసుకుంటాయని అన్నారు. ప్రమోద్ సావంత్‌కు రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు కూడా ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..