కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజుల క్రితయం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు.
రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు పిల్లలు చెరువులో పడి గల్లంతయ్యారు. వారికోసం చెరువులో దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. లభ్యమయ్యారు. ఒడ్డుకు తీసుకొచ్చి చూసేసరికి వారు చనిపోయి ఉన్నారు. 24 వార్డుకి చెందిన సంతోష్, వెంకట సుధీర్ అనే ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు.