Kolkata Murder Case: మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..: కోల్‌కతా ఘటన బాధితురాలి తల్లి
- రోజుకో మలుపు తిరుగుతున్న కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన
- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారు- బాధితురాలి తల్లి
- తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పింది- బాధితురాలి తల్లి
- ఈ ఆరోపణలను ఖండించిన సీఎం మమతా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కాగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలను మమత ఖండించారు. ఈ దుష్ప్రచారం తమ ప్రభుత్వం పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని అన్నారు. ఈ క్రమంలో.. బాధితురాలి తల్లి స్పందిస్తూ, ‘మీకు నష్టపరిహారం ఇస్తామని, మీ కుమార్తె జ్ఞాపకంగా ఏదైనా తయారు చేయిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. నేను మాత్రం నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటాను’ అని చెప్పానని తెలిపింది.
Mahavir phogat: వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు.. పెద్దనాన్న మహవీర్ వ్యాఖ్య
Also Read
రాష్ట్రంలో అత్యాచారం, హత్య ఘటనపై నిరసనను ఆపాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసింది. అలాగే దుర్గాపూజ ఉత్సవాలకు సిద్ధం కావాలని సీఎం ప్రజలను కోరింది. ఈ క్రమంలో.. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ఇది అమానవీయమని పేర్కొంది. ‘నేను ఒక ఆడపిల్లకు తల్లిని కాబట్టి ఇలా చెప్పడం అమానుషంగా భావిస్తున్నాను. నా కూతుర్ని పోగొట్టుకున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకోవాలనుకుంటే, చేసుకోవచ్చు. మా ఇంట్లో కూడా మా కూతురుతో దుర్గాపూజ జరుపుకున్నాం. నా కూతురు ఇప్పుడు ఉంటే ఇంట్లో జరుపుకునేది. కానీ.. ఇప్పుడు నా జీవితంలో చీకటి ఏర్పడింది.’ అని తెలిపింది. తన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే.. ఇలా మాట్లాడి ఉండేదా? అని బాధితురాలి తల్లి ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!