స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద భారతదేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి సాధనలో ఈ చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గుండె ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలి నివేదికలలో.. జిమ్ చేయడం వల్ల గుండెపోటు మరణాల కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే.. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, దీని కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్‌ను శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ సాధించాడు. మెండిస్ తన అర్ధసెంచరీని పూర్తి చేసిన వెంటనే.. తన పేరిట ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. అతని అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుండి వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 ప్లస్ పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.
యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు.
ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. అంధేరీలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్‌గా గుర్తించారు.