ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో శాంసంగ్, ఆపిల్ వంటి ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు, ఆఫర్‌లు ఇస్తున్నారు. ఫెస్టివ్ సీజన్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ S23 FE (Galaxy S23 FE) కూడా ఉంది. మీరు శాంసంగ్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం.
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తన పాత రిక్రూట్‌మెంట్‌లలో ఒకదాన్ని పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ యొక్క 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి-ఏప్రిల్ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.
విశాఖ నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయం కలకలం రేపుతోంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అతను విడుదలైన తర్వాత ముంబై రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు.
జెమినీ టీవీ యాంకర్‌గా పని చేసి.. 'నిన్ను చూస్తూ' సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి... నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు - బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు.
మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.మ
మీకు చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్ నమలడమంటే ఇష్టమా? రోజూ అదే పనిగా నములుతున్నారా? మీరు టైంపాస్ కోసం చూయింగ్ నములుతున్నారా? లేదా ముఖానికి మంచిదనే కారణంతో నములుతున్నారా?.. ఇందుకు కారణం ఏదైనా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు అద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు.