ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాయచోటి పట్టణంలో చిన్న వ్యాపారస్తులు వద్ద గేటు రూపంలో డబ్బులను రౌడీ లాగా వసూలు చేస్తూ, రౌడీ రాజ్యంలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
Read Also: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
కౌన్సిల్ సభ్యులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలిని.. రౌడీ రాజ్యం అని మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గేటు వసూలు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. గేటు వసూలును తొలగించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సభ్యులందరూ గౌరవంగా ప్రవర్తించాలని కౌన్సిలర్లకు సూచించారు.
Read Also: Ravichandran Ashwin: ప్రపంచ క్రికెట్‌లో ఏకైక బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్!