ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగనుంది.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు.
40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు తన 56వ షోరూంను కడపలో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఆపిల్ (Apple) ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు ఇతర ప్రసిద్ధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తూ అక్టోబర్ 3 నుండి పండగ సేల్ (దీపావళి సేల్) ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా.. ఆపిల్ కంపెనీ స్టోర్‌లలో కూడా భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ దీపావళి సేల్ ప్రయోజనం వినియోగదారులకు కంపెనీ యొక్క ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందిస్తున్నారు.
బ్లాక్ హెడ్స్ ఒక రకమైన మొటిమలు. వీటిని మొటిమల వల్గారిస్ అని కూడా అంటారు. ఇవి చర్మ రంధ్రాలలో అదనపు నూనె, మృతకణాలు చేరడం వల్ల ఏర్పడుతాయి. అంతే కాకుండా.. చర్మ రంధ్రాలలో వైట్ హెడ్స్ వస్తాయి. దీనిలో చర్మం డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి టెస్ట్ సిరీస్ కావచ్చని బ్రాడ్ తెలిపాడు.
అదానీ గ్రూప్‌కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు.
కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో.. బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే తక్కువగా మారింది.