Grand Celebrations: తెలుగు హీరోయిన్‌కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. గ్రాండ్ సెలబ్రేషన్స్
- తెలుగు హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
- బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు
- గచ్చిబౌలిలోని డెక్కన్ సరై గ్రాండ్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెమినీ టీవీ యాంకర్‌గా పని చేసి.. ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి… నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్ చేశారు. గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా కూడా అక్కడ ఉత్సాహంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత హేమలత రెడ్డి మన్ దువా మేడమ్‌తో కలిసి బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు. కాగా.. ఈ నెల 28న హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత గచ్చిబౌలిలోని డెక్కన్ సరై గ్రాండ్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు.
Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నాను. జెమిని టీవీలో ఒక యాంకర్‌గా మొదలు పెట్టి సీరియల్స్ చేశాను. ఆ తరువాత ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్‌తో ప్రొడ్యూసర్ కావాలి అనుకుని ఒక సినిమా తీశాను. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశాను. సెలెక్ట్ అయ్యి రౌండ్స్ అన్ని వర్చువల్‌గా కంప్లీట్ చేశాను. ఫైనల్ సెలక్షన్స్‌కి మలేషియా వెళ్లాను. అక్కడ కాంపిటీషన్ చాల టఫ్‌గా నడిచింది. దక్షిణాది నుండి నేను మాత్రమే వెళ్లగలిగాను. చివరిగా గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నేను గెలుస్తాను అని అనుకోలేదు. అక్కడ నార్త్ & సౌత్ అనే పార్షియలిటీ లేదు. అటు నటన, అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. నేను ప్రొడ్యూసర్‌గా, హీరోయిన్‌గా చేసిన సినిమా నిన్ను చూస్తూ.. ఆ సినిమాలో సుహాసిని, సుమన్, సయాజి షిండే లాంటి సీనియర్ నటులతో నటించాను. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా సుహాసిని ఎన్నో మంచి టిప్స్ ఇచ్చారు. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్. అలాగే నాకు మా కుటుంబం నుండి మంచి సపోర్ట్, ముఖ్యంగా మా నాన్న నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. NTV, TV9లో కూడా నేను పని చేశాను. ఆడవారు గ్లామర్‌గా మాత్రమే కాదు, ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తాను. నా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా కెరియర్‌ని నేను ఫ్యూచర్‌లో చేసే రోల్స్, సినిమాలను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Mr Idiot: మస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ట్రైలర్ చూసేయండి
గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా మాట్లాడుతూ.. గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 39 సిటీలలో 60 మంది కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేశామరని.. 35 మందిని మలేషియా తీసుకెళ్లామని తెలిపారు. టైటిల్ విన్నర్‌గా హైదరాబాద్ అమ్మాయి హేమలత రెడ్డి గెలిచారు.. చాలా టఫ్ కాంపిటీషన్ నడిచిందని, విన్నర్‌ని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైందని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నాం.. 149 దేశాల నుంచి ఎంట్రీస్‌ని తీసుకుంటున్నాం.. ఆ ఫినాలేని ప్యారిస్‌లో ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతే గాక.. ఈ గ్లామన్ అవార్డు గెలుచుకున్న హేమలత రెడ్డిని త్వరలోనే పారిస్‌కు తీసుకొని వెళ్ళబోతున్నాము అని మన్ దువా తెలిపారు.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!