ఏపీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. దీంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లలోకి ప్రభుత్వం పరిహారం సాయం అందజేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త రిటెన్షన్ నిబంధనను రూపొందించింది. అక్టోబర్ 31 లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని కోరింది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. తదుపరి సీజన్ కోసం మెగా వేలానికి ముందు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని.. మిగిలిన వారిని విడుదల చేయమని చెప్పాడు.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్‌ను 154 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక తన గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ) మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాలులో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది…
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.
ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే చనిపోయింది. మరోవైపు.. తల్లి కుమారుడు కోసం…
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు.
బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
శాంసంగ్ (Samsung) తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. కంపెనీ శాంసంగ్ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌లో రెండు మోడళ్లను పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాప్ ఎస్ 10 ప్లస్ (Galaxy Tab S10 Plus), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 అల్ట్రా (Galaxy Tab S10 Ultra) అనే దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను లాంచ్ చేశారు. ఇవి AI ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.
వాట్సాప్‌లో వినియోగదారులు పంపడం, సందేశాలు స్వీకరించడం, వీడియోలు, ఫోటోలు మరియు పత్రాలను భాగస్వామ్యం చేయడం వంటి పనులను సులభంగా చేయవచ్చు. అయితే, చాలా సార్లు మనం ఒక ముఖ్యమైన పత్రాన్ని లేదా ఫైల్‌ని ఎవరికైనా పంపవలసినప్పుడు వారి నంబర్‌ను సేవ్ చేయాలి. లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా వాట్సప్ మెస్సెజ్ వెళ్లదు. అయితే నంబర్‌ను సేవ్ చేయకుండానే ఏ యూజర్‌కైనా వాట్సాప్ మెసేజ్‌ని పంపే మార్గం ఉందని మీకు తెలుసా..