IPL 2025: హార్దిక్‌ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి
- టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు
- ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా
- రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవాలన్న అజయ్ జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అవసరమైతే విడుదలైన తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు. కాగా.. సెప్టెంబర్ 28న ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి కొత్త నిబంధనలు వచ్చాయి. ఇందులో ఆర్టీఎం కార్డ్‌లు ఉన్నవారితో సహా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
Grand Celebrations: తెలుగు హీరోయిన్‌కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. గ్రాండ్ సెలబ్రేషన్స్
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ముంబై ఇండియన్స్ వద్ద చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నందున కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని అజయ్ జడేజా సూచించారు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కొనసాగించాలని.. పాండ్యాను విడుదల చేయాలని తద్వారా వేలంలో తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు ఆటగాళ్లని ముంబై ఖచ్చితంగా రిటైన్ చేస్తుందని జడేజా అన్నారు. ఈ ఆటగాళ్లు వేలంలోకి వెళితే వారిని కొనడం అసాధ్యం.. ముంబై ఇండియన్స్ ఆర్టీఎం కార్డును హార్దిక్ పాండ్యా కోసం ఉపయోగిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
ఈసారి ఐపీఎల్‌లో కొత్త నిబంధన ఉంది. ఈ నిబంధనలో ఆర్టీఎం కార్డ్ అమలు తర్వాత.. ఇతర జట్లకు వేలం వేయడానికి మరొక అవకాశం లభిస్తుంది. తమ జట్టులో ఆడిన ఆటగాడు వేలంలో అందుబాటులో ఉంటే అతడిని తిరిగి పొందడానికి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటగాడు వేలంలో రూ. 16 కోట్ల ధర పలికాడని అనుకుందాం. వేలంలో ఏ జట్టు అతడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆర్టీఎం కార్డుని ఉపయోగించి పాత ఫ్రాంచైజీయే అతడిని దక్కించుకోవచ్చు. అంటే బిడ్డింగ్‌లో గరిష్ఠంగా ఎంత ధర పలికితే అంత ధరకు తిరిగి జట్టులోకి తీసుకోవడం అన్నమాట. ఈ ప్రక్రియలో ఆటగాళ్ల ధర పెరగవచ్చు లేదా తగ్గవొచ్చు. అవకాశాన్ని బట్టి పాత ఫ్రాంచైజీలే తిరిగి దక్కించుకునేందుకు వీలు కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?