భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. వర్షం కారణంగా తొలి టెస్టులో మొదటి రోజు ఆట రద్దయింది. టాస్ పడకుండానే ఆట రద్దు అయింది.
ఇండియాలో ఎలిస్టా (Elista) గూగుల్ టీవీ(Google TV)ని ప్రారంభించింది. తాజాగా.. 85 అంగుళాల(inches) సైజు టీవీని విడుదల చేసింది. ఇంతకు ముందు.. 32 నుండి 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు. గూగుల్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. లేస్ బెజెల్ డిజైన్ వస్తుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.
మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బాలెనో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో బాలెనో సాధారణ మోడల్‌కు భిన్నంగా ఉండే అప్‌డేట్‌లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ టూ-వీలర్ iVoomi తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్ మోడల్ iVoomi జీట్ఎక్స్ ze, iVoomi S1 టాప్ రేంజ్‌లో ఇస్తున్నారు. జీట్ఎక్స్ ze కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే S1ని కొనుగోలు చేసే వారు రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు.
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించినందుకు పురుషుల జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సస్పెండ్ చేసింది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ హతురుసింఘా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇటీవల భారత్‌తో జరిగిన అన్ని టెస్టులు, టీ20 సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. బీసీబీ (BCB) అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయించింది.
జియో భారత్ ఈరోజు 4G ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. జియోభారత్ V3, జియోభారత్ V4 పేరుతో మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 సదస్సులో ఈ ఫీచర్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే.. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది.
మారుతున్న వాతావరణంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్.