Aloe vera-Curd: కలబందను పెరుగులో కలిపి రాసుకోండి.. ఈ మార్పులు గ్యారెంటీ..!
- పెరుగు.. కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగం
- కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
- పెరుగులో మాయిశ్చరైజింగ్ గుణాలు
- కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే చర్మానికి మంచిది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే.. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది. ఈ రెండింటిని కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు కూడా మేలు జరుగుతుంది. పెరుగు, కలబందను ఎలా ఉపయోగించాలో.. దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Health: జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క దానితో సెట్..!
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
జుట్టు కోసం కలబంద, పెరుగును ఎలా ఉపయోగించాలి..
కలబంద, పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టుకు కలబంద, పెరుగు మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏమిటంటే..
-ఒక గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల పెరుగు, అలోవెరా జెల్ కలపాలి.
– 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్, 1/2 టీస్పూన్ జోజోబా ఆయిల్ కలపండి.
-బాగా మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి షవర్ క్యాప్ ధరించండి.
– అరగంట లేదా 1 గంట పాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.
జుట్టుకు కలబంద, పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
-మొదటది కలబంద, పెరుగుతో చేసిన ఈ హెయిర్ మాస్క్ జుట్టు ఆకృతిని సరిచేయడంలో సహాయపడుతుంది.
-రెండవది కలబంద, పెరుగుతో చేసిన ఈ హెయిర్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది.
-ఇది జుట్టులో కొల్లాజెన్‌ను పెంచుతుంది. రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తుంది. అనేక ఇతర సమస్యలను తగ్గిస్తుంది.
-కలబంద, పెరుగు ప్యాక్‌లో యాంటీడాండ్రఫ్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టులో చుండ్రు సమస్యను నివారిస్తుంది.
చర్మం కోసం కలబంద, పెరుగు వాడకం.. చర్మానికి ఎలా ఉపయోగించాలి:
కలబంద, పెరుగు వాడకం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది లోపలి నుండి చర్మానికి పోషణను అందించడంలో.. దాని ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా
-ఒక చెంచా అలోవెరా జెల్ తీసుకుని అందులో తేనె కలపాలి.
-రెండూ కలిపిన తర్వాత పెరుగు, రోజ్ వాటర్ వేయాలి.
-అన్నీ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.
-30 నిమిషాలు వేచి ఉండి, చల్లటి నీటితో స్క్రబ్ చేయడం ద్వారా ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
కలబంద మరియు పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
-ఈ రెండూ మీకు మాయిశ్చరైజింగ్ మాస్క్‌లుగా పని చేస్తాయి.
-రెండూ ముఖాన్ని హైడ్రేట్ చేస్తాయి. పోషణను అందిస్తాయి. ఇది మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది.
-ఇది అప్లై చేయడం వల్ల ముఖం మృదువుగా, తేమగా ఉండి అందంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..