31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ విలువ రూ.32 వేల కోట్లు.
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణమవుతున్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువకులలో స్ట్రోక్ కూడా పెరుగుతోందని పరిశోధకులు కనుగొన్నారు. స్ట్రోక్‌ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా లేనప్పుడు లేదా మెదడులోని రక్త నాళాలు కొన్ని కారణాల వల్ల పగిలినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 16) నుండి జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయం కారణంగా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ భారత్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో.. మహ్మద్ షమీ గురించి కీలక ప్రకటన చేశాడు.
చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు కోచ్‌లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది.
విజయవాడ పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ నెల 16వ తేదీన ఏపీ కెబినెట్ భేటీ కానుంది. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన కెబినెట్ అజెండా వాయిదా పడటంతో.. ఆరోజు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ రోజు.. రతన్ టాటా చనిపోవడంతో అజెండాను మంత్రి వర్గం వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ద్వారా స్వీకరించింది. అయితే.. నేటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి సుమారు 85 వేలకి పైగా దరఖాస్తులు వచ్చాయి
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు.
కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేమిమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.