Health: జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క దానితో సెట్..!
- మారుతున్న వాతావరణంతో అనేక సీజనల్ వ్యాధులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలు
- సీజనల్ వ్యాధుల్లో జలుబు.. దగ్గు.. జ్వరం అధికం
- జ్వరం.. జలుబు.. దగ్గు.. గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతున్న వాతావరణంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్. ఈ వైరస్ బారిన పడడం వల్ల తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, శరీరం బలహీనపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. మారుతున్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో లిక్కోరైస్ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని రుచి చక్కెరలా తియ్యగా ఉంటుంది. దీనిని మిఠాయి, పాల ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా.. పొగాకు పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు.
లిక్కోరైస్‌లో సుక్రోజ్, స్టార్చ్, ప్రొటీన్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్లు ఉంటాయి. దీనిని.. జలుబు, దగ్గు ఉన్నప్పుడు కషాయంగా చేసుకుని సేవిస్తే.. గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. జ్వరాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. లిక్కోరైస్ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు ఎలా నయం అవుతాయి.. దాని కషాయాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. లిక్కోరైస్ అనేది ఆయుర్వేద లక్షణాలతో కూడిన మూలిక. దీనిని అనేక వ్యాధుల చికిత్సకు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని అనేక వ్యాధులకు చికిత్స కోసం వాడవచ్చు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో లిక్కోరైస్ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లిక్కోరైస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు మంటను నియంత్రిస్తాయి. దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ICICI Bank Fraud: బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ముగిసిన సీఐడీ విచారణ
లిక్కోరైస్ తీసుకోవడం వల్ల శ్లేష్మం పలచబడి గొంతు, ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు వస్తుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న లిక్కోరైస్.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గొంతు సమస్య ఉన్నట్లయితే లిక్కోరైస్ డికాక్షన్ తీసుకుంటే.. అది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాపును అదుపులో ఉంచుతుంది.
లిక్కోరైస్ డికాక్షన్ తయారు చేసే విధానం:
కావలసినవి:
1-2 టీస్పూన్లు లైకోరైస్ పౌడర్
2 కప్పుల నీరు
1-2 టీస్పూన్లు తేనె
అల్లం
పద్ధతి:
కషాయాన్ని తయారు చేయడానికి మొదట నీటిని మరిగించాలి.
వేడినీటిలో లిక్కోరైస్ పౌడర్, అల్లం వేయాలి.
ఈ నీటిని మళ్లీ 10-15 నిమిషాలు మరగబెట్టాలి.
15 నిమిషాల తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె కలుపుకుని తాగాలి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఈ కషాయాన్ని రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగవచ్చు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!