డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్‌ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు.
పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 49 విభాగాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. వివిధ అంశాలపై మొత్తంగా 24 పాలసీలు రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్కు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో.. జిల్లా జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.
దసరా పండుగ సందర్భంగా విజయవాడ సందడిగా మారింది. రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. రాష్ట్రం నుంచి తమ సొంతూర్లకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. దీంతో.. బెజవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన బోర్డు.. తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఎగ్జామ్స్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. మరోవైపు.. మోడల్ ఆన్సర్ బుక్‌లెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.