3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది.
శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV కోసం కొత్త బాస్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. అనేక కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది. డీలర్‌షిప్ స్థాయిలో యాక్సెసరీస్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్‌లో మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్‌లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు.
పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఎట్టకేలకు సొంతగడ్డపై టెస్టు విజయాన్ని రుచి చూసింది. 1349 రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఇదే తొలి టెస్టు విజయం. పాకిస్థాన్ తరఫున ఈ టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు స్పి్న్నర్లు రెచ్చిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లతో మొత్తం 20 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో…
ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి.. దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గడిచిన ఆరు గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతుందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం సాయంత్రానికి వాయుగుండం చెన్నైకి 190 కి.మీ., పుదుచ్చేరికి 250 కి.మీ, నెల్లూరుకి ఆగ్నేయంగా 270కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తరువాత క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు.
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు.
మీ శరీరంలో వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ చేయాలి. బరువు తగ్గడం కోసమని.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ బ్రెడ్, పాస్తా, తీపి తృణధాన్యాలు, ఐస్ క్రీమ్‌లు మరియు స్వీట్లు, ఫుల్-క్రీమ్ డైరీ ఉత్పత్తులు, సాస్‌లకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు వంటి ఆహారాలు ఉంటాయి. ఈ ఆహారాలు తినడం వల్ల…
రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా.. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది.