ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు.
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు తమ అవసరాల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ వర్గాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకుల వర్గం కూడా ఉంది. వీరికి భారతీయ రైల్వే వివిధ సడలింపులను ఇస్తుంది.
రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్‌గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు.
వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 'స్పెషల్-20' క్లబ్‌లోకి చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 20 మంది మెన్ బ్యాట్స్‌మెన్ సాధించిన కెరీర్ బెస్ట్ టెస్ట్ రేటింగ్‌ల జాబితాలో రూట్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం జో రూట్ 932 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నాడు.
లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు.
ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మీరు తిరుమల వెళ్లాలని అనుకుంటే మాత్రం ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టికెట్లు అలా వచ్చి ఇలా అయిపోతాయి. అంత ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు గొప్ప సన్మానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు.