తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంట వరకు క్లాసులు జరగనున్నాయి. వేసవి కాలం నేపథ్యంలో ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
Read Also: Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్..
తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటిపూట బడులు నిర్వహించడానికి నిర్ణయించింది. ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతుండగా.. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.
Read Also: Pawan Kalyan : ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టద్దుః పవన్ కల్యాణ్