టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా.. నిన్న ధోని, రిషబ్ పంత్, సురేష్ రైనా కలిసి గ్రూప్ గా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈరోజు భార్య సాక్షితో కలిసి ధోనీ ఓ పాట పాడుతూ కనిపించాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే పాటను పాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ధోని దంపతులు లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా పెద్ద సంఖ్యలో జనసమూహంతో కలిసి ఆడిపాడారు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. పంత్ సోదరి వివాహ వేడుకల్లో ధోని జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు సురేశ్ రైనా కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. వీరిద్దరు సతీసమేతంగా ప్రతి ఈవెంట్‌లో పాల్గొని తెగ హడావుడి చేశారు. ధోని అయితే తమ ఇంట్లో ఫంక్షన్ అన్నట్లు లీనమైపోయి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
This was my all time favourite song 😭😭.. I was listening this morning also 😭💛!!
Tu Jaane naa 🫶🏻!!pic.twitter.com/Wb3wulVjVL
— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) March 12, 2025
Taliban: రైలు హైజాక్‌తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..
2011 ప్రపంచ కప్ ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోని, గౌతమ్ గంభీర్.. రిషబ్ పంత్ సోదరి, ఆమె భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ధోని మోర్స్ కోడ్ ప్రింట్ ఉన్న టీ-షర్ట్ ధరించి కనిపించాడు. గంభీర్ కూడా బ్లాక్ టీ-షర్ట్ ధరించి కొత్త వధూవరులతో ఫోటోలు దిగారు. మంగళవారం ఉదయమే ఎంఎస్ ధోని ముస్సోరీకి చేరుకోగా.. బుధవారం గౌతమ్ గంభీర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. రిషబ్ పంత్ తో కలిసి ధోని, సురేష్ రైనా సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ బుధవారం విమానాశ్రయంలో మీడిమాతో మాట్లాడినప్పుడు సంతోషంగా కనిపించారు. ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో భారత ప్రధాన కోచ్ కీలక పాత్ర పోషించారు. కాగా.. 2013లో ధోని నాయకత్వంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అది వన్డే క్రికెట్‌లో జట్టుకు ఐసీసీ టైటిల్ గెలుచుకున్న తొలి విజయం. ఈ వేడుకల అనంతరం ధోని సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నారు. ఐపీఎల్ 2025 కోసం శిక్షణ పొందేందుకు చెన్నైకి వెళ్ళనున్నారు. మరోవైపు, గంభీర్ తన సన్నిహితులతో సమయం గడపాలని చూస్తున్నారు. పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని బుధవారం (మార్చి 12) ఉదయం పెళ్లి చేసుకుంది. సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుండగా.. ఆమె భర్త అంకిత్ లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు.