యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు అయింది. హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షమయ్యాయి.. గత నెల 28న కోటబాస్ పల్లి పరిసరాల్లో చిరుత పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. అయితే.. ఓ కూన పిల్లను గుర్తించి అటవీ శాఖ వైద్యులు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం.. పులి కూన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా మరో పులి కూనను డ్రైవర్ జావిద్ గుర్తించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బయట బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నాం.. కానీ బూతులతో పాటు, అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు.. ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 23వ రోజు కొనసాగుతుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు ఆటంకంగా మారాయి.
గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై మైనర్ బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారానికి పాల్పడిన వీడియోను మరో మైనర్ బాలుడు రికార్డు చేశాడు.
ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్ మ్యాచ్ (మార్చి 15) శనివారం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ జట్లు తుది పోరులో తలపడ్డాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది.