Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి రియాక్షన్
- షర్మిల వ్యాఖ్యలు సరికాదు- భూమన కరుణాకర్ రెడ్డి
- జగన్ నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణం- భూమన
- ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్- భూమన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు. తెలంగాణ నా మెట్టునిల్లు అని చెప్పిన షర్మిల.. చివరకు అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారని ఆరోపించారు. షర్మిల వెనుక ఏ ఒక్క రాజశేఖరరెడ్డి అనుచరులు రాలేదు.. అంతా జగన్ వెనుక నడిచారని భూమన తెలిపారు. చివరకు కాంగ్రెస్‌లోనూ మీకు మద్దతు లేదని విమర్శించారు. ఇవాళ అన్ని విధాలా షర్మిల ఒంటరి అయ్యారు.. షర్మిల లాంటి చెల్లి జగన్‌కు ఉండడం చాలా బాధాకరమని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని భావించే టీడీపీతో షర్మిల కుమ్మక్కు అవడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Mann Ki Baat – PM Modi: ‘డిజిటల్ అరెస్ట్’లపై మోడీ ఆందోళన.. ప్రజలకు కీలక సూచనలు..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
- Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
- Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
జగన్‌ను సర్వ నాశనం చేయాలని షర్మిల ఇలా చేస్తున్నారు.. హామీలు అమలు చేయలేక టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని భూమన ఆరోపించారు. నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.. ఈ నెల షర్మిల అంశాన్ని తెచ్చారని అన్నారు. ఇంత జరుగుతుంటే షర్మిలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్క, చెల్లి, తమ్ముళ్లకు ఎన్ని ఆస్తులు పంచాడో చంద్రబాబు చెప్పాలని అన్నారు. మరోవైపు.. 164 సీట్లు వచ్చినా కూటమి సంతోషంగా పాలించలేక పోతోందని ఆరోపించారు.
Read Also: Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..
ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి జగన్.. జగన్ అంటే వీరికి భయం అని భూమన తెలిపారు. పెళ్ళై ఇన్నేళ్ళ తర్వాత ఆస్తుల పంపకంకు పూర్తి సహకారం అందిస్తున్న వైఎస్ భారతిని అభినందించాలి.. ఓడినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆస్తుల పంపకం కుటుంబ వ్యవహారం.. అయినా చంద్రబాబు రాజకీయ అవసరాలకు షర్మిలను వాడుకుంటున్నారని తెలిపారు. షర్మిల టీడీపీలో చేరుతారో లేక కాంగ్రెస్ నుండే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!