మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు. 2004 ఎన్నికల అఫిడివిట్‌లో లక్షల్లో సంపాదన, జూబ్లీహిల్స్‌లో చిన్న ఇల్లు చూపించిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 8 లక్షల కోట్లు ఆస్తిని సంపాదించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు.
Read Also: Ayatollah Khamene: ఇజ్రాయిల్ దాడిపై ఎలా ప్రతిస్పందించాలో మా అధికారులు నిర్ణయిస్తారు..
జూబ్లీహిల్స్‌లో బంగ్లా, లోటస్ పాండ్, బెంగళూరులో 82 గదుల ప్యాలెసులు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ లక్షల కోట్లు అన్ని మీ తాత, తండ్రి నీకు ఇచ్చిన ఆస్తులు కాదు కదా అని పేర్కొన్నారు. జగన్ జైలుకు వెళ్ళాడు కానీ.. షర్మిల జైలుకి వెళ్ళలేదు కదా కాబట్టి ఆమెకు ఆస్తుల్లో వాటా రాదని సుబ్బారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, లిక్కర్, మైన్స్‌లను అడ్డాలుగా చేసుకుని జగన్ దోపిడీకి, లూటీకి ఒడిగట్టాడని మంత్రి తెలిపారు.
Read Also: Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)