IND vs NZ 3rd Test: వాంఖడేలో మొదటి రోజు ఎవరికి అనుకూలం.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్
- నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్
- మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే.. ఈ సిరీస్‌ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. కాగా.. సిరీస్ స్కోర్‌లైన్ ఎలా ఉంటుందనేది సిరీస్ చివరి మ్యాచ్ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పిచ్ ఎలా ఉంటుందో మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక్కడ ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండదని, దానిపై స్పిన్నర్లకు టర్న్ వస్తుందని.. అయితే మొదటి రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నివేదికలలో పేర్కొన్నారు. బెంగళూరులో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తే.. పూణెలో స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే ముంబైలో వాతావరణం కాస్త భిన్నంగా ఉండవచ్చు.
Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!
Also Read
సోమవారం బీసీసీఐ చీఫ్, పిచ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్.. ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీతో పాటు ముంబై వాంఖడే స్టేడియం క్యూరేటర్ రమేష్ మముంకర్ కలిసి పిచ్‌ను సమీక్షించారు. “ఇది స్పోర్టింగ్ ట్రాక్ అవుతుంది. ప్రస్తుతం పిచ్‌పై కొంత పచ్చిక ఉంది. ఈ వికెట్ మొదటి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండవ రోజు నుండి స్పిన్నర్లు టర్న్ పొందడం ప్రారంభిస్తుంది” అని తెలిపారు.
CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..
చివరిసారిగా 2021 డిసెంబర్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్‌లో మొదటి రోజు నుండి స్పిన్నర్లకు సహకరించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 276/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 167 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. టీమిండియా బౌలర్ అశ్విన్ 42 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!