మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం అయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భర్త వెల్లూరు రాజా (22), భార్య పెంచలమ్మ (20).. దీపావళి పండుగ కోసమని అన్నమయ్య జిల్లా చిట్వేలులోని అత్తగారి ఇంటికి వెంకటగిరి నుంచి బయల్దేరారు. అయితే.. రాపూరు బస్టాండ్ నుంచి బస్సులో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఒక్క అపరిచిత వ్యక్తితో దంపతులు రాజంపేట పాత బస్టాండ్‌లో దిగారు.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే... కాగా.. గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన ఇచ్చారు. ఈ క్రమంలో.. తాను వేలానికి వెళితే ఎంత మొత్తం వస్తుందని అభిమానులను అడిగాడు పంత్.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రేపటి నుంచి (నవంబరు 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు) నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు.
సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు.
మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.