కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్‌గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆదివారం ముగిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. భారత జట్టు 29.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై…
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో 'గుంతలు పూడ్చే' పనులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు.
చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తాను కార్యకర్తల మనిషిని, కార్యకర్తల కోసమే నిలబడతానని అన్నారు. తాను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఇంఛార్జికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.
వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్‌కు తమ కుక్క కూడా భయపడదని విమర్శించారు. తమ ఆఫీస్‌ను కూల్చినట్లు.. రుషి కొండను కూల్చేస్తారా అని అన్నారు. చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.. చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలని దుయ్యబట్టారు.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.