టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్‌కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.
వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్ 13 అనేది కంపెనీ తాజా ఫోన్.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 24GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ ప్లస్ యొక్క ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది.
ఆరోగ్యంగా ఉండేందు కోసం సీజనల్ పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో.. కాలీఫ్లవర్ ఒకటి, ఇది రుచికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి.
శీతాకాలం మొదలైంది. చలికాలం మన చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో శరీరానికి అవసరమైన విటమిన్ డి విటమిన్ కావాలి.
ఉసిరికాయతో చేసిన ఉసిరి ఊరగాయ, రసం అంటే చాలా మందికి నచ్చుతాయి. ఉసిరి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. ఉసిరికాయ వినియోగం చర్మం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర, బరువును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్‌ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్‌లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది.
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది.
మొదటి రోజు డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు. వీడియోలో ఆ మూమెంట్ చూస్తే.. పంత్‌ను రోహిత్ శర్మ తిట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఏదో విషయంలో కోపంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.