Andhra Pradesh: రేపు “గుంతల రహిత రోడ్ల” కార్యక్రమం ప్రారంభం..
- రేపు “గుంతల రహిత రోడ్ల” కార్యక్రమం ప్రారంభం- మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
- సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం- మంత్రి
- రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” కార్యక్రమం
- ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు. రేపు లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ మోడ్ లో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేపడతామని మంత్రి తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 290 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి నుంచి రూ. 220 కోట్ల నిధులు, రహదారులు మరమ్మతులుకు సంబంధించి రూ. 350 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గుంతల రహిత రోడ్ల మిషన్ విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి రోడ్ల మరమ్మతుల పనులను లాంఛనంగా ప్రారంభించడం మొదలవుతోందని.. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా రోడ్ల మరమ్మతుల పనులు మొదలవుతాయన్నారు. అలాగే ఈ రోడ్ల మరమ్మతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎటువంటి అలసత్వానికి రోడ్ల మరమ్మతుల విషయంలో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా రోడ్ల మరమ్మతులు పూర్తైన తర్వాత సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి గుంతలు రహిత రోడ్ల సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు, ఈ కార్యక్రమం నిరంతరం అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
గత వైసీపీ పాలనలో ప్రజలకు రోడ్డు మీదకు రావాలంటే భయం వేసే దుస్థితి.. గత ఐదేళ్లుగా దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని మెజార్టీ రోడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఆర్ధికంగా సుస్థిరాభివృద్ధి సాధించాలన్నా.. పరిశ్రమలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలన్నా.. ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనే కీలకమని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సమగ్ర ప్రణాళికతో అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా రోడ్లకు సంబంధించిన పనులకు ఆమోదం తెలపడం, మరమ్మతులు చేయడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు.. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో పూర్తిగా గుంతలమయంగా మారిపోయిన రోడ్లను గుంతల రహితంగా మార్చాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడంతో పాటు, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న రూ. 350 కోట్ల బిల్లులను తక్షణమే కాంట్రాక్టర్‌లకు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధిలో అమలవుతున్న నూతన విధానాలను అధ్యయనం చేసేందుకు ఆర్ & బీ శాఖ మంత్రిగా ఇటీవల గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించినట్లు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానంలో చేపడుతున్న రోడ్లు, రోడ్ అసెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (RAMS) లను పరిశీలించామన్నారు. ఆయా విధానాలను మన రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను సైతం పరిశీలిస్తున్నామని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయన్నారు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 129 నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి 3,300 కి.మీ మేర హైవేల పనులు నిర్మాణంలో ఉన్నాయి.. అంటే రాష్ట్రంలో మొత్తంగా రూ. 76 వేల కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో మరో రూ. 30 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!