ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని విడుదల చేసింది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పేరుతో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు రెండు ఎంపికలలో లభిస్తాయి. స్టాండర్డ్ ప్యాక్ ధర ప్రస్తుత మోడల్ కంటే INR 24,000. ఆప్షనల్ ప్యాక్ ధర INR 51,700.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎంతో నిరాశపరిచారు. దీంతో.. వారి ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెలలో భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో.. భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా చర్యలు తీసుకోనుంది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది పెద్ద ప్రశ్నగా…
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
దాదాపు ఏడాది పాటు టీమిండియాకు దూరమైన మహ్మద్ షమీ ఆటను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రంజీ ట్రోఫీలో ఆడనున్న షమీ.. తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్‌లో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల బెంగాల్ జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కలేదు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓవర్‌లోడ్‌తో కూడిన బస్సు లోతైన లోయలో పడడంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఐఎఎస్‌లు బదిలీలు అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అలాగే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు.
తిరుచానూరు శిల్పారామంలో ప్రమాదం జరిగింది. శిల్పారామం క్యాంటీన్ వద్ద గల ఫన్ రైడ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. జెయింట్ వీల్‌లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ క్రమంలో.. ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు.