ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో.. ఇంగ్లాండ్ జట్టు ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ సెంచరీతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఇంగ్లీష్ జట్టు 16.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
Read Also: Bangladesh: షేక్ హసీనాను ఇండియా నుంచి రప్పించాలి.. ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా..
టీ20ల్లో అత్యధిక సెంచరీలు:
వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సాల్ట్ 54 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ తర్వాత.. ఫిల్ సాల్ట్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఎవిన్ లూయిస్, లెస్లీ డన్‌బార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ వాసిమ్‌లను ఫిల్ సాల్ట్ అధిగమించాడు.
Read Also: WBBL 2024: ఉమెన్స్ బిగ్ బాష్‌లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్..
టీ20ల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు:
3 – ఫిల్ సాల్ట్ vs వెస్టిండీస్
2 – ఇవాన్ లూయిస్ వర్సెస్ ఇండియా
2 – లెస్లీ డన్‌బార్ vs బల్గేరియా
2 – గ్లెన్ మాక్స్‌వెల్ vs ఇండియా
2 – మహ్మద్ వాసిమ్ vs ఐర్లాండ్