మారుతున్న నేటి జీవనశైలిలో మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. భారతదేశంలో అధికంగా షుగర్, బీపీ, కంటి చూపు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. షుగర్, బీపీ రాకుండా ఉండేందు కోసం మందులు, ఆహారంతో కంట్రోల్ చేయవచ్చు. కానీ.. కంటిచూపు విషయంలో అలా ఏమీ ఉండదు. ఆ సమస్య వచ్చే వరకూ తెలియదు. కంటిచూపు సమస్య వచ్చాక అందుకోసం.. లెన్సులు, అద్దాలు వాడుతుంటారు. ముఖ్యంగా ఈ సమస్య రావడానికి కారణం.. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం. అంతే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో.. క్రమంగా చూడడంలో ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.
Read Also: IND vs SA: రెండో టీ20.. భారత్ బ్యాటింగ్
ఈ వ్యాధులు కంటి చూపును తగ్గిస్తాయి:
బలహీనమైన కంటి చూపుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. దీంతో.. గ్లాకోమా లేదా బ్లాక్ క్యాటరాక్ట్, డయాబెటిక్ రెటినోపతి, కంటిశుక్లం, రెటీనా డిటాచ్‌మెంట్‌తో పాటు కార్నియా కూడా దెబ్బతింటుంది. అలాంటప్పుడు మీ కళ్లపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని అనుకుంటే.. సరైన ఆహారం తీసుకోవాలి.
కార్నియా అంటే ఏమిటి..?
కార్నియా ఆరోగ్యంగా ఉంటేనే కంటి చూపు సరిగా ఉంటుంది. కార్నియా అనేది కంటి బయటి పారదర్శక పొర. కంటి చూపుకు ఇది చాలా ముఖ్యం. ఇది అతినీలలోహిత కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. కార్నియాపై చిన్న గాయమైన దానంతటే అదే నయం అవుతుంది. దానిలో కణాలు, ప్రోటీన్లు, ద్రవం కలిగి ఉంటుంది .
కంటి చూపు కోసం బాదం:
బాదంపప్పు తినడం వల్ల కంటి చూపుకు చాలా మేలు చేస్తుంది. బాదంపప్పులో అధిక మొత్తంలో విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ఇది ఆక్సీకరణ నష్టం నుండి కళ్ళను రక్షిస్తుంది.
ఉసిరికాయ వినియోగం:
ఉసిరికాయను తినడం ఆరోగ్యానికే కాదు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్, నారింజ, బొప్పాయి, బ్రోకలీ, చిలగడదుంప, టిండా, గుడ్లు, ఆకు కూరలలో విటమిన్ ‘ఎ’ అధికంగా ఉంటుంది.