వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామాస్తులు చుక్కలు చూపించారు. ఫార్మా కంపెనీని గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అటు అధికారులు.. ఇటు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత గ్రామస్తులు సంయమనం కోల్పోయారు. జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడికి దిగారు. దీంతో.. వారు పరుగులు పెట్టక తప్పలేదు. కానీ వారు కారెక్కిన గ్రామస్తులు వదిలిపెట్టలేదు. కార్లపైన కూడా దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
Read Also: Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిపై కూడా దాడి చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దాడి అనంతరం.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జెన్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. దాడి ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. దుద్యాలలో జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
Read Also: Prajwal Revanna: రేవణ్ణకి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అత్యాచారం కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణ