రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు.
యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు.
ఎంఎస్ ధోనీ తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఫుటెక్‌లోని బీచ్‌లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు అంటూ ధ్వజమెత్తారు.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. తాజాగా.. నగరంలోని ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆక్రమణలను హైడ్రా (HYDRA) తొలగించింది. ఫిలింనగర్‌లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదుతో.. హైడ్రా ఫిలింనగర్ లేఅవుట్‌ను పరిశీలించింది. ఈ క్రమంలో.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించింది.
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై చెలరేగుతున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగారు. అయితే.. బిగ్ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ (7) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకోగా.. మరో ఓపెనర్ శాంసన్ అర్ధ సెంచరీతో చెలరేగారు. క్రీజులోకి దిగిన నుంచి శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈరోజు మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు జరుగనుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేయనుంది. డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు.