Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
- ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది- మల్లు రవి
- కొడంగల్ లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు
- బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు- మల్లు రవి
- ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని అన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేశారు.. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు నిమిష నిమిషానికి ఫోన్లు చేసి, మందు సేవించి కలెక్టర్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పై జరిగిన దాడికాదు, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని అన్నారు.
Jagadguru: ‘‘కాషాయం దేవుడి రంగు’’.. ఖర్గేపై జగద్గురు మండిపాటు..
Also Read
కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదు.. అహింస మార్గంలోనే తాము కేసీఆర్ పై పోరాడామని మల్లు రవి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కుటుంబ సభ్యుల మేలుకే కేసీఆర్ పదేళ్లు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దాడి చేయించి.. కేటీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలతో అంతకుముందే ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చారన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి, రేవంత్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేశారని మల్లు రవి తెలిపారు. ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారు.. ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ అమృత్ భారత్ పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్తున్నారు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమేనని మల్లు రవి అన్నారు.
IND vs AUS: టీమిండియా ఊపిరి పీల్చుకో.. టీంలోకి వచ్చేస్తున్న స్టార్ బౌలర్
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో సమాధానం చెప్పాలని ఎంపీ మల్లు రవి తెలిపారు. మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకు పోటీకి దూరంగా ఉన్నారు.. ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా శత్రువులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అడ్డుకునేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీనని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదు.. బీఆర్ఎస్ హయంలో కలెక్టర్లను, ఎస్పీలను, ప్రభుత్వ ఉద్యోగులను కూలీ వారిలా ట్రీట్ చేశారన్నారు. తాము అధికారుల్లాగా ట్రీట్ చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు బయటపెట్టండి.. అంతేకాని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలే బీఆర్ఎస్ నేతలకు సరైన గుణపాఠం చెప్తారు.. నిర్మాణాత్మక సూచనలు చేయకుండా దాడులకు పాల్పడటం సరైందికాదని అన్నారు. కొడంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తానే లేఖ రాస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!