ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది. అయితే.. ధోని ఈ సీజన్‌లో ఆడనున్నాడు. అందుకోసం.. అతనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే ఫ్రాంఛైజీ తీసుకుంది. కాగా.. ధోనీ ఈ ఐపీఎల్‌కు ఎప్పుడు గుడ్ బై చెబుతాడో అన్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బట్టబయలు చేశాడు. టీమ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుతో యూట్యూబ్ ఛానెల్ ప్రోవోక్డ్‌లో సంభాషణలో కాశీ విశ్వనాథన్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. జట్టు గురించి, ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. రాయుడు కాశీ విశ్వనాథన్‌ను.. ధోని ఎప్పుడు రిటైర్ కావాలని ప్లాన్ చేస్తున్నాడో తెలుసా అని అడిగాడు.
Read Also: AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….
దీంతో విశ్వనాథన్ స్పందిస్తూ, ‘మహి ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పడు.. తన వద్దే ఉంచుకుంటాడని మీకు తెలుసు. ఇలాంటి విషయాలు చివరి క్షణంలో బయటకు వస్తాయి. సీఎస్కే పట్ల అతని అభిరుచి ఏమిటో, అతని ఫాలోయింగ్ ఏమిటో మాకు తెలుసు, ధోనీ తన చివరి మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతాడు’ అని అన్నాడు. ‘సీఎస్కే విషయానికి వస్తే.. ధోనీ సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని మేము ఆశిస్తున్నాము. ఎంఎస్ ధోని ఆడాలనుకుంటున్నంత కాలం అతని కోసం సీఎస్కే తలుపులు తెరిచే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఆయన కమిట్‌మెంట్, డెడికేషన్ వల్ల ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటాడు’ అని విశ్వనాథన్ అన్నాడు.
Read Also: Weight Loss: జిమ్, వ్యాయమం చేయకుండా బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా..!