మహిళా సాధికారత కింద మోడీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా బెటాలియన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత, జాతీయ భద్రతలో వారి పాత్రను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు ఈ ఫోర్స్ ప్రాధాన్యత ఎంపిక అని.. ఫోర్స్‌లో వారి వాటా 7 శాతానికి పైగా ఉందని సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
Read Also: Vivo Y18t: Y-సిరీస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర రూ. 9,499
మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన యువతులు ఈ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేసేలా ప్రోత్సహిస్తుంది. దీంతో ఫోర్స్‌లో ఉన్న మహిళలకు కొత్త గుర్తింపు వస్తుంది. కాగా.. సీఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం కొత్త బెటాలియన్ యొక్క ప్రధాన కార్యాలయానికి ప్రారంభ నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేసే పనిలో పడింది. వీఐపీ భద్రత, విమానాశ్రయాల భద్రత, ఢిల్లీ మెట్రో రైల్ విధుల్లో కమాండోలుగా నిర్వహించగల అద్భుతమైన బెటాలియన్‌ను రూపొందించేందుకు ప్రత్యేకంగా శిక్షణను రూపొందిస్తున్నారు. అయితే.. సీఐఎస్‌ఎఫ్ 53వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు మొత్తం మహిళా బెటాలియన్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Read Also: PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. 16-21 తేదీల్లో 3 దేశాల్లో టూర్