ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరిని వరించిందో తెలుసా..?
- ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను ప్రకటించిన ఐసీసీ
- పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి అవార్డు
- మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌కు అవార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో నోమన్ అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. నోమన్ రెండు మ్యాచ్‌ల్లో 13.85 సగటుతో మొత్తం 20 వికెట్లు తీశాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై పాక్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.
Read Also: Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
నోమన్ అలీ (38) దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఏడాదికి పైగా రోజుల తర్వాత పాకిస్థానీ ఆటగాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది ఆగస్టులో బాబర్ ఆజం ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నోమన్ మాట్లాడుతూ.. “నేను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో నాకు సహాయం చేసిన నా సహచరులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాకిస్తాన్ ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.” అని తెలిపాడు.
Read Also: Banking Rules: మీకు అలా జరిగిందా? అయితే బ్యాంకు మీకు రోజుకు రూ.100 చెల్లించాల్సిందే
మరోవైపు.. అమేలియా కెర్ (28) అక్టోబర్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కెర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికైంది. ఫైనల్లో 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా మూడు వికెట్లు తీసింది. ఆమె మొత్తం టోర్నమెంట్‌లో 15 వికెట్లు పడగొట్టింది. ఇది ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా సాధించింది. ఆమె బ్యాట్‌తో ఆరు మ్యాచ్‌ల్లో 135 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!