తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణను సిట్ ప్రారంభించింది. ఉదయం తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీబీఐ డైరెక్టర్‌కు నివేదికను ఇవ్వనుంది ఈ బృందం.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి దీపాల పండుగలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 13 రోజులు దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం కార్యక్రమం.. 14వ రోజు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు.
ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో రాబోతోంది. విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాని ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్‌మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్‌పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అలెక్స్ కారీ (19), మిచెల్ స్టార్క్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాసేపటి క్రితం ముగిసిన పీఏసీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరిగింది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.