హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. రోజుకో విశేష కార్యక్రమాలతో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతుంది. దేవతా మూర్తుల కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది.
తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు.
నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.
బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ సత్తా చాటింది. ఉప ఎన్నికలో ఆర్జేడీ, వామపక్షాలను మహా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ఇండియా కూటమి ప్రభావం ఏ మాత్రం కనబరచలేకపోయింది. బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీలో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయం.. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్‌ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని చంద్రబాబు పేర్కొన్నారు.
కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 14వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు.. జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు మ్యాచ్ ఆటను ఎవరూ ఊహించలేదు. పెర్త్‌లో తొలిరోజు మొత్తం 17 వికెట్లు పడ్డాయి. 1952 తర్వాత ఆస్ట్రేలియాలో తొలిరోజు అత్యధిక వికెట్లు పడిన రికార్డు ఇదే. ఈ క్రమంలో తొలిరోజే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో నాథన్ లియాన్, మార్ష్.. పంత్‌ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, సిరాజ్ మధ్య వాగ్వాదం…
పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు స్వాములు మృతి చెందారు. ఈ ఘటన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివ మాల వేసుకున్న మొత్తం ముగ్గురు స్వాములు స్నానం చేయడం కోసమని దిగుడు బావిలోకి దిగారు. ఈ క్రమంలో స్వాములు గల్లంతు కాగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.