ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 09:42 గంటలకు గనులు, భూగర్భ శాస్త్ర మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ రావు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
Read Also: Anmol Bishnoi: అమెరికా ఆశ్రయం కోరుతున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..
ఈ సందర్భంగా సి.ఎం.ఆర్. ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ.. తమ 37వ షోరూమును మచిలీపట్నంలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్ తగు విధంగా అన్ని మోడల్స్‌లో.. కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై వేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందని చెప్పారు.
Read Also: AP High Court: ఇదేం పద్ధతి, ఇదేం భాష?.. గుంటూరు మేయర్‌కు హైకోర్టు చురకలు
సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. సి.ఎం.ఆర్ అంటే ది పన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమ 37వ షోరూమును మచిలీపట్నంలో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో.. డిజైన్లు, వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి సచ్చేవిధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతారలు నైనా సారిక, పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించారు. పట్టు ఫ్యాన్సీ చీరలు తమకెంతో నచ్చాయన్నారు.. అభిమానులతో సెల్ఫీలు దిగి తమ డ్యాన్సులతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.