విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు.
Read Also: Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్‌ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..
ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని గంగరాజు అనే వ్యక్తి భారీ మోసం చేశాడు. రెండేళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ట్రైనింగ్ కోసం అప్పులు తెచ్చుకున్నామని.. డబ్బులు లేక ట్రైనింగ్ కోసం పర్సనల్ లోన్ యాప్స్ లోన్ తీసుకొని మరి డబ్బులు చెల్లించామని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో డబ్బులు కట్టాలని లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. పదుల సంఖ్యలో గంగరాజు ఇంటి వద్దకు బాధితులు చేరుకున్నారు. ఈ క్రమంలో.. గంగరాజుపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్‌లో సంచలనం..