Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అభిమానులు ఎంతో కాలంగగా ఎదురు చూస్తున్న సమయం ఇది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ హిట్ కోసం తపిస్తున్న అఖిల్‌కు లెనిన్ మాసివ్ హిట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అఖిల్‌కు హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నాగార్జున అనుకున్నట్టే కొడుక్కి సూపర్ హిట్ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకులు ఎమోషనల్ అయిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలలో లెనిన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
మొదటి రోజు 16.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 37.2 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడు రోజుల్లో మాస్ ర్యాంపేజ్ చూపించాడు అఖిల్. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. తన కెరీర్లోనే హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.. సితార సంస్థ చెప్పినట్టే ఇక నుంచి అక్కినేని అభిమానులు అఖిల్ 2.0 చూడాలనుకుంటున్నారు. గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే.. ఇక నుంచి అఖిల్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. నిజానికి అఖిల్ కటౌట్‌కి ఈపాటికే పాన్ ఇండియా రేంజ్లో ఉండాల్సింది. కానీ కాలం కలిసి రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు లెనిన్ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి నుంచి అఖిల్ కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేస్తే.. పాన్ ఇండియా స్టార్ లిస్ట్‌లో చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి అఖిల్ ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. కాగా లెనిన్ సినిమాతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా మొదటి విజయాన్ని అందుకుంది.
Also Read
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!