చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది.
ఐపీఎల్ మెగా వేలంలో ఎంతగానో ఎదురు చూసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ అమ్ముడుపోయాడు. 13 ఏళ్ల ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్‌ను అనుకున్న ధర కంటే ఎక్కువగానే కొనుగోలు చేసింది. బీహార్‌కు చెందిన వైభవ్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. చివరకు ఆర్ఆర్ జట్టు ఇతన్ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.
స్ట్రాంగ్ బౌలింగ్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను కొనుగోలు చేసింది. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ మిస్టరీ స్పిన్నర్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్.
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు కొనసాగుతుంది. వేలంగా ప్రారంభం కాగానే.. బిడ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పేరు వచ్చింది. గత సీజన్‌లో ఆర్సీబీ జట్టును గెలిపించడంలో సాయశక్తుల పోరాడినప్పటికీ.. చివరకు సెమీస్ వరకు చేర్చాడు. ఒంటి చేత్తో కొన్ని మ్యాచ్‌లను కూడా గెలిపించాడు డుప్లెసిస్. అయితే.. ఈసారి కూడా ఆర్టీఎం (RTM) ఉపయోగించి బెంగళూరు ఈ ఆటగాడిని జట్టులోకి తీసుకుంటుందనుకుంటే.. వద్దని చేతులెత్తేశారు. దీంతో డుప్లెసిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు.
పిజ్జా అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. వివిధ రకాల పదార్థాలతో పిజ్జాలను తయారు చేసి అమ్ముతుంటారు. మీరు కూడా పిజ్జాలో అనేక రకాల పిజ్జాలను తినే ఉంటారు. అయితే చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్ అవుతుండటంతో పాటు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనీయుల ఆహారం గురించి ప్రపంచ మొత్తం తెలుసు.. వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాములు, క్రిములు, కీటకాలు, కప్పలు ఇలాంటి ఆహారాలను తింటారని మనకు…
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.
కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులు ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని…
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు.