హోండా కంపెనీ భారత మార్కెట్లో అనేక విభాగాల్లో స్కూటర్లు, బైక్‌లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే... తాజాగా టూ-వీలర్ ICE విభాగంలో కూడా అందిస్తుంది. అయితే కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు (27 నవంబర్ 2024)న విడుదల చేయనుంది.
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్ రోప్‌ను చేపట్టారు.
భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బైకులను తయారు చేశారు. ఓలా కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+లను చేర్చింది.
ఐపీఎల్ 2025 వేలంలో 10 ఫ్రాంచైజీలు మొత్తం 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌పై భారీ ధర పలికింది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా ఐపీఎల్ 2025 వేలంలో భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. మరోవైపు.. పిన్న వయస్సు ఉన్న ఆటగాళ్లను ఈ వేలంలో కొనుగోలు చేశారు.
కరివేపాకును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ 'వ్యక్తిగత కారణాల' కారణంగా మంగళవారం (నవంబర్ 26) ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి తిరిగి రానున్నారు. అయితే డిసెంబర్ 6 నుండి అడిలైడ్‌లో ప్రారంభమయ్యే రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నారు.
ఐపీఎల్ వేలం చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలైంది. ఐపీఎల్‌లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. తాజాగా జరిగిన మెగా వేలంలో భారత్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు.
ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. జెడ్డాలో ఆటగాళ్లకు సంబంధించి 10 ఫ్రాంచైజీల మధ్య రెండు రోజుల పాటు బిడ్డింగ్ జరిగింది. ప్రతి ఫ్రాంచైజీ తమ తమ జట్లలో 18 నుంచి 25 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ క్రమంలో.. జట్లు బలాబలాలేంటి.. ఏ జట్టు వేలంలో ఆచితూచి అడుగులు వేసింది. ఏ ఫ్రాంచైజీ మంచి జట్టును సిద్ధం చేసింది.. ఏ ఫ్రాంచైజీ బలహీనమైన జట్టుగా ఉంది. వేలంలో ఏ ఫ్రాంచైజీ తప్పుడు నిర్ణయాలు తీసుకుందనే దానిపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్…