చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది.
జెడ్డాలో ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగింది. ఈ వేలంలో బిడ్డింగ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పేరును ఇవ్వలేదు. అయితే.. అందుకు గల కారణాన్ని స్టోక్స్ చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ డౌక్ సెంటర్‌లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు.
2024 డిసెంబర్ 4న అమేజ్ 2024ని హోండా విడుదల చేయనుంది. అయితే.. ఈ కారు లాంచ్ కాకముందే.. బుకింగ్ అనధికారికంగా ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ కార్ బుకింగ్‌లను కొంతమంది డీలర్లు తీసుకుంటున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుత రోజుల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. కలుషిత గాలి వల్ల దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధులు వస్తాయన్నది అందరికీ తెలుసు. అయితే వాయు కాలుష్యం చాలా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా..? అవును, వాయు కాలుష్యం దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న సమస్యలే కాకుండా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. పింక్ బాల్ మ్యాచ్‌కు భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం కష్టమే అనిపిస్తుంది. గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. నవంబర్ 30 నుండి కాన్‌బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు.
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి.. మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
స్కోడా భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కొత్త SUV స్కోడా కైలాక్‌ను విడుదల చేసింది. అందు కోసం కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్ ప్రారంభించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్‌లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది.
అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ వీర విహారం చేశాడు. 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఒక రోజు తర్వాత.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.