మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు.
దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
వైసీపీ తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు.. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయన్నారు.
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ 15వ రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని 15వ రోజు విజయవంతం చేశారు. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో…
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.